![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1077 లో..... రాజుని ఎందుకు వెళ్ళమన్నావని ఇందుపై అపర్ణ కోప్పడుతుంది. రాజుకి ఫోన్ చేస్తానని అపర్ణ చేయబోతుంటే వద్దని రేఖ అంటుంది. వెళ్లిన వాడిని ఎందుకు రమ్మంటావని రేఖ అంటుంది. రాజుకి అపర్ణ ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తుంది. నువ్వు నా గురించి ఎలా బాధపడుతున్నావో తన గురించి తన పేరెంట్స్ కూడా బాధపడుతారు కదా అని ఇందు అంటుంది. రాజు వచ్చాకే నీ జీవితంలో మార్పు వచ్చింది.. అలా ఎలా వదులుకుంటావని ఇందుని అపర్ణ కోప్పడుతుంది. ఆ తర్వాత చూసావా నా ప్లాన్ అని భ్రమరాంబతో రేఖ అంటుంది.
మరోవైపు రాజు డల్ గా కూర్చొని ఉంటాడు. అతని దగ్గరికి వెంకీ వస్తాడు. నువ్వు ఇందుని పెళ్లి చేసుకోవడమేంటి.. అసలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అంత సీక్రెట్ గా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ బ్రో.... వదిన అంటే అందరికి ఇష్టమే కానీ నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అని వెంకీ అంటాడు. గొప్పొళ్ళకి శత్రువులు ఉంటారని నాన్న భయం అని రాజు అంటాడు. మరొకవైపు ఎందుకు ఇందు ఇలా చేస్తావ్.. రాజుని వదులుకోకు అని అపర్ణ, సుభాష్ చెప్తారు. మీ అమ్మని మీ నాన్న పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు.. ఇంట్లో ఎవరు కోడలుగా ఒప్పుకోలేదు మీ నాన్న కూడా భార్యగా ఒప్పుకోలేదు.. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు.. కానీ నువ్వు నీ భర్తని వెళ్లిపోయేలా చేసావ్.. నువ్వు ఒకసారి రమ్మంటే వస్తాడని ఇందుతో అపర్ణ చెప్తుంది. నాకోసం వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేనని ఇందు అంటుంది. మరొకవైపు రేఖ, భ్రమరాంబ, శేషు, భూషణ్ మాట్లాడుకుంటారు.
ఇక ఆ రాజుగాడు వెళ్ళిపోయాడు. దాని దగ్గర ఉన్న పవర్స్ అన్ని లాక్కొని ఆస్తులు సొంతం చేసుకుంటానని రేఖ అంటుంది. ఆ మాటలు స్వాతి విని వెంటనే ఇందు దగ్గరికి వెళ్లి చెప్తుంది. అక్క బావ నీకు సపోర్ట్ చేస్తాడు.. రమ్మని చెప్పమని స్వాతి అంటుంది. నేను పిలవనని ఇందు అంటుంది. తరువాయి భాగంలో ఇందు చేత రేఖ సంతకాలు పెట్టిస్తుంటే అప్పుడే నందు వచ్చి సంతకాలు ఒక ఇందు పెడితే సరిపోదు.. నేను కూడా పెట్టాలి.. నేను చిన్నప్పడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నందుని అని తను చెప్పగానే అందరు షాక్ అవుతారు. రేఖకి రాజు ఫోన్ చేసి ఎలా ఉంది పిన్ని ట్విస్ట్ అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |